మిషన్ తెలంగాణ 2028 ఎన్నికల శంఖారావాన్ని పూరించిన బీజేపీ
- తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి పి.ఎల్.శ్రీనివాస్
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో పెరుగుతున్న ఆందోళన
సికింద్రాబాద్, జూలై 2 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నాంది పలికే తొలి రాజకీయ శంఖారావాన్ని మోగించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హైదరాబాద్ పర్యటన సాధారణ సంస్థాగత కార్యక్రమం మాత్రమే కాదు. అది పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కి, ప్రతిపక్ష బీఆర్‌ఎస్కు స్పష్టమైన రాజకీయ సందేశాన్ని అందించేలా అత్యంత వ్యూహాత్మకంగా రూపొందించిన పర్యటనఇది.
అధికారికంగా తెలంగాణగామిషన్.. ప్రకటించడం ద్వారా రాష్ట్రం ఇప్పుడు బీజేపీ జాతీయ రాజకీయ ప్రాధాన్యతలలో అగ్రస్థానానికి చేరిందని పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఈ ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే కాకుండా, దశాబ్ద కాలం అధికారంలో ఉన్న తర్వాత, తొలి ఎన్నికల పరాజయంతో రాజకీయ ప్రాధాన్యత కోసం పోరాడుతున్న బీఆర్‌ఎస్కూ ఆందోళన కలిగించే పరిణామంగా మారింది.
ప్రకటనకు అత్యంత కీలకమైనది...
2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ఆరు ప్రధాన హామీలతో ప్రజల ముందుకు వచ్చి అధికారాన్ని చేపట్టింది. అయితే రెండున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆ హామీల్లో అనేకం పూర్తిస్థాయిలో అమలు కాలేదు లేదా అమలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ప్రధాన కారణంగత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, భారీ అప్పుల భారాన్ని మిగిల్చిందన్నదే బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణపై భారీ రుణభారాన్ని మిగిల్చిన విషయాన్ని ఎవరూ ఖండించలేరని పి.ఎల్. శ్రీనివాస్ తెలియజేశారు.






