3 July, 2026 | 1:10 AM

ఆర్టీసీ ఈ అనుమానాలు!

03-07-2026 12:00 AM

వరుస హైవోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు 

ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ బంద్

ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం 

భద్రతపై నివేదిక ఇవ్వాలని జేబీఎం సంస్థకు ఆదేశాలు

100 శాతం సేఫ్టీ సర్టిఫికేట్ వస్తేనే సర్వీసుల పునరుద్ధరణ

వరంగల్, జూలై 2 (విజయక్రాంతి): నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద టీజీ ఆర్టీసీలో నడుస్తున్న జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధిలో తిరిగే జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను తాత్కాలిక నిలిపివేసింది.

జూన్ 21న కరీంనగర్ సమీపంలో అలుగునూర్ వద్ద జరిగిన బస్సు అగ్ని ప్రమాదంపై పూర్తి నివేదిక రాకముందే మరొక సంఘటన జరగడంతో ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీ జేబీఎం సంస్థను ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యలు, బ్యాటరీ ఫిట్నెస్ సర్టిఫికేషన్, హైదరాబాద్ బస్సు భవన్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు, భద్రత అంశాలపై స్పందించి నివేదిక సమర్పించాలని  కోరిం ది. 100 శాతం సేఫ్టీ సర్టిఫికేట్ వస్తేనే సర్వేసుల పునరుద్ధరించనున్నట్టు సమాచారం.