calender_icon.png 22 August, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కొరతపై బీజేపీ రాష్ట్ర చీఫ్‌కు అవగాహన లేదు

22-08-2025 02:02:09 AM

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): తెలంగాణలో యూరియా కొరతపై బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు రాంచందర్‌రావుకు అవగాహన లేదని, అందుకే రోజుకోలా ఆయన యూరియాపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో రాంచందర్‌రావు పదవి క్రికెట్ మ్యాచ్‌లో వాచ్‌మెన్ లాంటిదని ఎద్దేవా చేశారు.

‘తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ నుంచే యూరియా కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నది. అయినప్పటికీ రాష్ట్రానికి యూరియా కేటాయింపు తక్కువగా ఉంది. రాష్ట్రప్రభుత్వం ఆగస్టు అవసరాలను గుర్తించి, జూన్ నుం చే ప్రతిపాదనలు పంపుతుంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది’ అని ఎంపీ ప్రశ్నించారు.  బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావుకు దమ్ముంటే రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), మెట్రో ఫేస్ 2, మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని సవాల్ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విసిరారు.