23-12-2025 02:12:36 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 20౨ మంది భారతీయ పురుషులను రష్యా తన సాయుధ దళాల్లోకి చేర్చుకున్నట్లు భారత విదేశాంగశాఖ తాజాగా ప్రకటించింది. వీరిలో 119 మందిని తిరిగి తీసుకురావడంలో తాము విజయం సాధించినప్పటికీ, మరో 50 మంది భారతీయులు మాత్రం అక్కడే చిక్కుకుపోయారని స్పష్టం చేసింది.
కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో 26 మంది భారతీయులు మరణించగా, ఏడుగురి ఆచూకీ లభించడం లేదు. అక్కడ చిక్కుకున్న 50 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తు న్నది. భారత విదేశాంగశాఖ దీనిలో భాగంగానే రష్యన్ ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నది. భారతీయులను ప్రలోభ పెట్టి రష్యన్ అధికారులు తమ ఆర్మీలో చేర్చు కోవడంతో యుద్ధంలో పాల్గొంటున్నారు.