02-01-2026 12:11:06 AM
సంయుక్త లీడ్‌రోల్‌లో నటిస్తున్న పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ‘ది బ్లాక్ గోల్డ్’. యోగేశ్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మాగంటి పిక్చర్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. మురళీశర్మ, రావు రమేశ్, నాజర్, మనీష్ వాధ్వా, రామ్కీ, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, బీవీఎస్ రవి, కృష్ణచైతన్య, చంద్రిక రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది.
పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయని టీమ్ పేర్కొంది. తాజాగా చిత్రబృందం ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని 2026 వేసవిలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు కూడా ఈ సందర్భంగా నిర్మాతలు ప్రకటించారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏ వసంత్ డీవోపీగా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీని రామ్ క్రిషన్ పర్యవేక్షిస్తున్నారు.