calender_icon.png 23 October, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురుగు కాల్వలో నల్ల!

23-10-2025 12:30:49 AM

- విద్యార్థుల ఆరోగ్యం గుల్ల.. 

-గోపతండలో పాఠశాలలోని ట్యాంక్ కు బయటవైపు నల్లా ఏర్పాటు                                  

- మురుగు కాల్వలోకి విద్యార్ధులు దిగి నీరు తాగాల్సిన పరిస్థితి.                   

- నల్లా ఏర్పాటులో నిర్లక్ష్యం వహించిన గ్రామపంచాయతీ సిబ్బంది.                            

- ఆరోగ్యాలు దెబ్బతింటాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన

మోతె, అక్టోబర్ 22 : విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పాఠశాలల ఏర్పాటుతో పాటు వాటిలో మౌలిక వసతుల కల్పనకు తగిన నిధులను కేటాయిస్తుంది. అయితే వాటి నిర్వాహణలో అధికారులు అలసత్వం వహించడంతో అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా అదే విద్యార్థుల పాలిట శాపంగా మారి ఇబ్బందులు కలిగిస్తుంది. ఇటువంటి ఘటనే మండల పరిధిలోని గోపతండలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. తండాలోని పాఠశాలలో సుమారు 40 మంది వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

అయితే వారికి అవసరమైన వసతుల కల్పనలో భాగంగా తాగునీటి అవసరాలను తీర్చేందుకు పాఠశాల ఆవరణలో ఒక ట్యాంక్ ను ఏర్పాటు చేసి దానికి నల్లాను ఏర్పాటు చేయడంతో విద్యార్థులు తమ తాగునీటి అవసరాలను తీర్చుకునేవారు. ఇది కొంతకాలం సక్రమంగా నడిచింది కానీ తదుపరి కొంత మంది ఆకతాయిలు పాఠశాలలో ప్రవేశించి ఆ ట్యాప్ విరగ్గొట్టడంతో ఉపాధ్యాయులకు విద్యార్థుల ఆరోగ్యం పై పూర్తిస్థాయి అవగాహన ఉండడం అంతగా దానిని వెంటనే ఏర్పాటు చేయాలన్న సదుద్దేశ్యంతో కొత్త ట్యాప్ కొని గ్రామపంచాయతీ సిబ్బందికు ఇచ్చి ఏర్పాటు చేయమని సూచించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ  దాని ఏర్పాటులోనే గ్రామపంచాయతీ సిబ్బంది అలసత్వం వహించడంతో అదే విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది.

  ట్యాంకు బయటవైపు నల్లా ఏర్పాటు : గ్రామపంచాయతీ సిబ్బంది పాఠశాల వేళల్లో కాకుండా ఇతర సమయంలో వచ్చి పాఠశాల లోపలకు ఉండాల్సిన నల్లాను తండావాసులందరికీ ఉపయోగపడాలంటూ ఏమాత్రం ఆలోచన చేయకుండా మురుగు కాల్వలో ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు గత్యంతరం లేక మరుగు నీరు పారుతున్న కాల్వలోకి దిగి నీరు త్రాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వీధిలో వెళుతున్న తండావాసులుది సైతం అదే పరిస్థితి. ఇది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే గ్రామాలలో టైఫాయిడ్, మలేరియా, వైరల్ ఫీవర్ ల వంటివి విజృంభిస్తున్నాయని వీటిని మరచిన అధికారులు ఇలా ఏర్పాటుచేసిన దానిపై స్పందించకపోవడం దారుణం అంటున్నారు.

పిల్లలు కాల్వలోకి దిగే క్రమంలో జారిపడితే కాళ్లు చేతులు విరిగే ప్రమాదం ఉందని, అలాగే అపరిశుభ్రంగా ఉన్న కాలువలోకి దిగి నీరు తాగితే దాని ఫలితంగా అనారోగ్యాల పాలవుతారంటూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్, విద్యా శాఖాధికారులు స్పందించి ఆ ట్యాప్ ని మురుగు కాల్వ వైపుకుకాకుండా పాఠశాల లోపల వైపు ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్యాలకు ఏ ఇబ్బందులు లేకుండా చూడాల ని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.