29-10-2025 01:06:48 AM
అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేసి, రక్తదానం చేసిన ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.రక్తదానం ప్రాణధానంతో సమానమని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
అమరవీరుల వారోత్సవాల సందర్భంగా స్వచ్చందంగా యువత , ప్రజలు,ఆటో డ్రైవర్లు,పోలీస్ అధికారులు, సిబ్బంది సుమారు 460 మంది రక్తదాన శిబిరంలో పాల్గొనడం అభినందించదగ్గ విషయమని,విధి నిర్వర్తనలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లోను ముందు వరసలో వుంటారని, ముఖ్యంగా రక్తదానంపై వున్న ఆపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు.మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో,ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి,తల సేమియా వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, మధుకర్, నటేష్,ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు, డాక్టర్ సంధ్యారాణి,కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గుడ్లరవి,పెండ్యాల కేశవరెడ్డి, బుస్స ఆంజనేయులు, కరీంనగర్,సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.