calender_icon.png 6 August, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న కలెక్టర్

06-08-2025 12:00:24 AM

- పీహెచ్‌సీ, పీఏసీఎస్ సెంటర్ల తనిఖీ

- ఈవూ మిషన్ ద్వారానే యూరియా తీసుకోవాలి

- కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి):  గత కొన్ని రోజులుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక సహకార సంఘాల కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేస్తూ హడలెత్తిస్తున్నారు. ఏ రోజు ఏ మండలంలో కలెక్టర్ పర్యటిస్తారోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. తాజా గా మంగళవారం తాంసి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వైద్యసేవలు అందిస్తున్న తీరుపై అరా తీశారు. అన్ని వార్డులను కలియతిరుగుతూ పరిశీలించారు. ఎఎన్‌సీ రిజిష్టర్‌ను పరిశీలిస్తూ ముడు విడతలుగా తీసుకోవలసిన డోస్‌ల పై ఆరా తీస్తూ, రిజిష్టర్‌లో సక్రమంగా నమో దు చేయాలన్నారు. అలాగే బెడ్స్‌పై ఉన్న బెడ్ షీట్ ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు అని అడిగి తెలుసుకొని, ఎప్పటికప్పుడు  శుభ్రపరచాలని సూచించారు. హాజరు రిజిష్టర్ పరిశీలించి, గైర్హాజైన వారి గురించి వివరాలు సేకరించాలని డాక్టర్ శ్యామ్‌ను ఫోన్‌లో ఆదేశించారు.

అదేవిధంగా పిఎసిఎస్ సెంటర్‌ను తనిఖీ చేసి, యూరియా ఎంత స్టాక్ ఉంది, రైతుకు ఈ పాస్ మిషన్ ద్వారా  ఎలా సెల్ చేస్తున్నారు అని అరా తీశారు. తాంసితో పాటు భీంపూ ర్ సబ్ సెంటర్ లో స్టాక్ ఎంత ఉంది, నానో యురియాకు సంబందించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వానాకాలం పంటలో ఎక్కువగా పత్తి పంటను వేయడం జరిగిందనీ, 4 లక్షల 50 వేల ఎకరాల పత్తి సాగు చేయడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా 30, నుండి 40 టన్నుల యూరియా అవసరం పడుతుంద ని, ఇప్పటి వరకు 30 వేల టన్నులు అమ్మ డం జరిగిందనీ, ఇంకా 10 వేల టన్నుల యూరియా వచ్చే నెల వరకు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కానీ రైతులు ఎక్కువగా యూరియా వాడకూడదని, సైంటిస్టులు కూ డా చెబుతున్నారన్నారు. నానో యూరియా మంచి ప్రోడక్ట్, ఒకేసారి మొత్తం తీసుకెళ్లవద్దని, యూరియా అన్ని షాపులో అందు బాటులో ఉందని, అవసరం ఉన్నంత మేరకే తీసుకెళ్లాలని సూచించారు. యూరియా ఈ pass మిషన్ ద్వారానే తీసుకోవాలి, మధ్యదళారులను ఆశ్రయించవద్దని ఆన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ లక్ష్మీ సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.