calender_icon.png 7 May, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్తాబైన భాగ్యనగరి!

07-05-2025 12:00:00 AM

-మిస్ వరల్డ్ 2025 పోటీలకు అంతా సిద్ధం

-116 దేశాల నుంచి వచ్చిన అందాల తారలు

-తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించనున్న పోటీదారులు

-తెలంగాణ ఘనకీర్తిని ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి):  ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలకు తెలంగాణ ముస్తాబైంది. 116 దేశాల నుంచి అందాల తారలు ఈ కార్యక్రమం లో పాల్గొననున్నారు. అమెరికా, యూర ప్, ఆఫ్రికా, కరీబియన్, ఆసియా దేశాల నుంచి వచ్చే ఈ పోటీదారులు తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించనున్నారు. ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాల ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పనున్నాయి. 

మిస్ వరల్డ్ 2025 షెడ్యూలు:

1. ప్రారంభోత్సవం 

మే 10:  హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలకు నుంచి మిస్ వరల్డ్ 2025లో పాల్గొనే సుందరీమణులు తెలంగాణకు చేరుకుంటున్నారు. 116 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొంటారు. తెలంగాణ సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడే వేదికగా గచ్చిబౌలి స్టేడియంలో వేడుక ప్రారంభమవుతుంది.

2. బౌద్ధ ఆధ్యాత్మిక యాత్ర

మే 12: నాగార్జునసాగర్, బుద్ధవనాన్ని ఆసియాకు చెందిన 28 మంది మిస్ వరల్డ్ 2025 టీమ్ బౌద్ధ థీమ్ పార్క్ సందర్శిస్తారు.

3.హైదరాబాద్ హెరిటేజ్ వాక్

మే 13: చార్మినార్, లాడ్‌బజార్‌లో  మిస్ వరల్డ్‌లో పాల్గొనే 116 మంది హైదరాబాద్ చారిత్రక వారసత్వ కట్టడాలను సందర్శిస్తారు. 

4. వెల్‌కమ్ డిన్నర్

మే 13: చౌమహల్లా ప్యాలెస్‌లో సాయంత్రం 6 గంటలకు సందర్శనతో పాటు మ్యూజికల్ కన్సర్ట్‌తో విందు

5. వరంగల్ హెరిటెజ్ టూర్

మే 14: సాయంత్రం 5 గంటలకు ప్రా రంభం అవుతుంది. వేయిస్తంభాల గుడి, వరంగల్ కోటను అమెరికాకు చెం దిన 22 మంది పోటీదారులు సందర్శిస్తారు.

6. రామప్ప టెంపుల్ టూర్ 

మే 14: సాయంత్రం 4:30 కార్యక్రమం ఉంటుంది. రామప్ప ఆలయాన్ని (యునెస్కో వారసత్వ కట్టడం) యూరప్ దేశాలకు చెందిన 35 మంది పోటీదారులు సందర్శిస్తారు. పేరిణి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. 

7. యాదగిరిగుట్ట టెంపుల్ టూర్ 

మే 15: సాయంత్రం 5 గంటలకు యా దగిరిగుట్టలో ప్రారంభం అవుతుం ది. కరేబియన్ దేశాలకు చెందిన 10 మం ది ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొంటారు.

8. హ్యాండ్లూమ్ ఎక్స్పీరెన్షియల్ టూర్ 

మే 15: సాయంత్రం 6 గంటలకు, పోచంపల్లిలో కార్యక్రమం. ఆఫ్రికా దేశాలకు చెందిన 25 మంది తెలంగాణ చేనేత వస్త్ర పరిశ్రమను సందర్శిస్తారు. 

9. మెడికల్ టూరిజం

మే 16: హైదరాబాద్ లోని పలు ఆస్పత్రులను మిస్ వరల్ట్ పోటీదారులు సందర్శిస్తారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న మెడికల్ టూరిజాన్ని తెలుసుకుంటారు. 

10. పిల్లలమర్రి సందర్శన

మే 16: పిల్లలమర్రి మహబూబ్‌నగర్‌లో జిల్లాలో అమెరికా గ్రూప్‌నకు చెందిన పోటీదారులు పిల్లలమర్రి చెట్టును సందర్శిస్తారు.

11. ఎకో టూర్ పార్క్

మే 16:  ఆసియాకు చెందిన 24 మంది పోటీదారులు ఎక్స్‌పీరియం ఎకో టూరిజం పార్క్ ను సందర్శిస్తారు. 

12. స్పోర్ట్స్ ఫినాలే

మే 17: గచ్చిబౌలి స్టేడియంలో పోటీదారులు స్పోర్ట్స్ ఫైనల్స్‌లో పాలుపంచుకుంటారు. 

13. రామోజీ ఫిల్మ్‌సిటీ టూర్

మే 17:  ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీని పోటీదారులు సందర్శిస్తారు.

14. సేఫ్టీ టూరిజం

మే 18: హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పోటీదారులు సందర్శిస్తారు. 

15.బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ విజిట్  తెలంగాణ రైజింగ్ విజన్

మే 18: సాయంత్రం సెక్రటేరియట్‌ను, ట్యాంక్‌బండ్‌ను పోటీదారులు సందర్శిస్తారు. నెక్లెస్ రోడ్డులో సండే ఫన్ డే కార్నివాల్ నిర్వహిస్తారు. 

16.కాంటినెంటల్ ఫైనల్

మే 20, మే 21: ఖండాల వారీగా పోటీదారుల ఫాస్ట్-ట్రాక్ సెలెక్షన్స్ 

17. ఐపీఎల్ సెమీఫైనల్స్

మే 20 లేదా 21: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీఫైనల్స్‌ను క్రికెట్ ఆడే దేశాలకు చెందిన 20 మంది పోటీదారులు తిలకిస్తారు. 

 18. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్

మే 21: సాయంత్రం యూరప్‌కు చెందిన 35 మంది శిల్పారామంలో తెలంగాణ డ్వాక్రా బజార్ స్టాళ్లను సందర్శిస్తారు.

19. మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

మే 22: శిల్పకళా వేదికలో 116 మంది పోటీదారులు వివిధ కళల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు.

20. హెడ్ టు హెడ్ ఛాలెంజ్

మే 23: ట్రైడెంట్ హోటల్‌లో మిస్ వరల్ట్ ఛాలెంజ్‌లో అందాల తారలు పాల్గొంటారు.

21. మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫైనల్

మే 24: సాయంత్రం  ట్రైడెంట్/హైటెక్స్‌లో సుందరీమణులందరూ ఫ్యాష న్, జ్యువెల్లరీ షోలో పాల్గొంటారు.

22. బ్యూటీ విత్ పర్పస్.. డిన్నర్

మే 24: హైటెక్స్ లో అందాల తారలంతా విందులో పాల్గొంటారు.

23. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్

మే 31:  సాయంత్రం 5:30 గంటలకు రెడ్ కార్పెట్ ఈవెంట్ ప్రారంభమవుతుం ది. రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు ఫైనల్. మిస్ వరల్డ్ విజేతను ప్రకటిస్తారు. 

24. రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవం

జూన్ 2: రాజ్‌భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో కొత్త మిస్ వరల్డ్, 6 ఖండాల విజేతలు, జూలియా మోర్లీ తో సహా 8 మంది రాష్ర్ట గవర్నర్, ముఖ్యమంత్రితో పాల్గొంటారు. ఇప్పటికే ఈ ఈవెంట్ ను సక్సెస్ చేసేందుకు అటు అధికారులు, ఇటు నిర్వాహకులు ఏర్పాట్లను దాదాపు పూర్తి చేశారని ఈవెంట్ ప్రతినిధులు తెలిపారు.