calender_icon.png 23 August, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

23-08-2025 12:11:54 AM

కామారెడ్డి, ఆగస్ట్ 22, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ సలహా దారులు మహమ్మద్ అలీ షబ్బీర్  తన యుడు మహమ్మద్ ఇలియాజ్ జన్మదిన సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధప డుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని నిర్వాహకులు డాక్టర్ బాలు,గంప ప్రసాద్ లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడు తున్న చిన్నారుల కోసం రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను, హెల్మెట్ ను అందజేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. తన కుమారుని జన్మదినం సందర్భంగా రక్త దానానికి ముందుకు వచ్చిన వారందరూ ప్రాణదాతలే అని అన్నారు. జన్మదినం సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో 105 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మహమ్మద్ ఇలియాజ్ కు తలసేమియా సికిల్ సెల్ సొసైటీ పురస్కారాన్ని డాక్టర్ బాలు, జలీల్,గ ంప ప్రసాద్ లు అందజేసారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు,మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, వివిధ మండలాల అధ్యక్షులు భీమ్ రెడ్డి, సుతారి రమేష్,అనంత రెడ్డి, యాదవ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి,రమేష్ గౌడ్,పిఏ లక్కప త్తిని గంగాధర్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్,ఐరేణి సందీప్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ధర్మగోని లక్ష్మి రాజా గౌడ్, పాత రాజు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, అన్ని మండల నాయకులు, యూత్  కాంగ్రెస్ నాయకులు, వివిధ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.