calender_icon.png 23 August, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలనలో పనుల జాతరతో మరింత అభివృద్ధి

23-08-2025 12:11:03 AM

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే పాయం 

బూర్గంపాడు,ఆగస్టు23,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పనుల జాతరతో మరింత అభివృద్ధికి నాంది పలికారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పినపా క ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సందెళ్ల రా మాపురంలో ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభం ,మొరంపల్లి బంజర గ్రామంలో రైతుకు ఎం జిఎన్‌ఆర్ ఈజిఎస్ ద్వారా సుమారు 7 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రే కుల షెడ్ ప్రారంభోత్సవం,

బూర్గంపాడు గ్రామంలోని రామాలయం ముందు సుమారు ఎనిమిది లక్షలతో నిర్మించిన సిసి రోడ్ ప్రారంభం, నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో సుమారు 5 లక్షల రూపాయల తో నిర్మించనున్న సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మహిళలకి వడ్డీ లేని రుణాలు, ఉచిత వి ద్యుత్ పథకం, సబ్సిడీ గ్యాస్ పథకం, ఇందిరమ్మ ఇల్లు, ఉపాధి హామీ కూలీ మహిళలకు రైతు ఆత్మీయ భరోసా, రైతులకు రైతు భరో సా వంటి ఎన్నో పథకాలు ఇప్పటికే ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పథకం ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో గడిచిన సంవత్సరంలో అం దించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు రానివారు అ ధైర్య పడొద్దు అని దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, ఎంపీడీవో జమలారెడ్డి, తహశీల్దార్ ప్రసాద్, పి ఆర్ డిఈ వెం కటేశ్వరరావు, పి ఆర్ ఏఈ చారి, సిడిపిఓ రేవతి, ఏపీవో విజయలక్ష్మి, నియోజకవర్గ బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి,

మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ భజన సతీష్, మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, నాయకులు బాదం రమేష్ రెడ్డి,కైపు శ్రీనివాస్ రెడ్డి,చల్లా వెంకటనారాయణ, యువజన నాయకులు భజన ప్రసాద్, నిమ్మల హరీష్ తదితరులు పాల్గొన్నారు.