calender_icon.png 18 September, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం మహత్తరమైన దానం

18-09-2025 12:00:00 AM

-శ్రీరాములు అందెల

-పీఎం నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్  (విజయక్రాంతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ర్ట శాఖ పిలుపు మేరకు “సేవా పక్వాడ” కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్  ఆదేశాల మేరకు బుధవారం మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలను రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్‌చార్జి  అందెల శ్రీరాములు  ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ  పీఎం మోదీ జన్మదినం (సెప్టెంబర్ 17) నుంచి మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అక్టోబర్ 2 వరకు సేవా పక్షం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న తోటి వారిని కాపాడడంలో రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారన్నారు.  నరేంద్ర మోదీకి భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. 

 కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, మీర్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు  పసునూరి భిక్షపతి చారి, తులసి ముఖేష్ ముదిరాజ్, బడంగ్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి, మహేశ్వరం మండలం బీజెపి అధ్యక్షులు టి యదీష్, కందుకూరు మండలం బీజేపీ అధ్యక్షులు నిమ్మ అంజిరెడ్డి, రాష్ర్ట నాయకులు, జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.