calender_icon.png 12 September, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి

12-09-2025 12:12:08 AM

సీపీఎం డిమాండ్

గద్వాల టౌన్ సెప్టెంబర్ 11 : జిల్లా విద్యుత్ అధికారులు స్పందించి పట్టణంలోని ట్రాన్ఫర్మార్లకు రక్షణ కంచెలు ఏర్పాటు చేసి ప్రమాదాలు నిరోదించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని గంజిపేట పార్కు పక్కల ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు పట్టణంలో ని పలు ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ కంచె లేకపోవడం పట్ల వర్షాకాలంలో పలు విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ల దగ్గర రక్షణ కంచె ను ఏర్పాటు చేయాలని ఆయన విద్యుత్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ,మజ్జిగ ఆంజనేయులు,కృష్ణ, భాస్కర్, నరసింహులు, కృష్ణ పాల్గొన్నారు.