calender_icon.png 12 September, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనం జగన్

12-09-2025 12:11:05 AM

అమీన్పూర్, సెప్టెంబర్ 11 :క్రమశిక్షణకు, అభ్యాసానికి, పట్టుదలకు నిదర్శనం న్యాయవాది జగన్ అని అమీన్పూర్ మండలం ఐలాపూర్ బీఆర్‌ఎస్ నేత, న్యాయవాది మాణిక్ యాదవ్ తెలిపారు. గురువారం తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.జగన్ ను హైకోర్టు బార్ అసోసియేషన్ లో ఐలాపూర్ మాణిక్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మాణిక్ యాదవ్ మాట్లాడుతూ న్యాయరంగంలో ఆయన సాధించిన విజయాలు, న్యాయవాదులకు అందిస్తున్న మార్గదర్శకత, సమాజానికి చేస్తున్నసేవలు ఆదర్శనీయమని తెలిపారు. అభ్యాసం, క్రమశిక్షణ, పట్టుదలతో ఎదిగిన ఆయనను కలవడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజల పట్ల, సమాజం పట్ల మరింత బాధ్యతతో ఉండాలని, ప్రజలకు చట్టంపై అవగా హన కల్పించాలని జగన్ సూచించినట్లు మాణిక్ యాదవ్ తెలిపారు.