12-09-2025 12:12:51 AM
చేసిన ఎస్పీ పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డుల పరిశీలన
అమీన్ పూర్, సెప్టెంబర్ 11 :అమీన్ పూ ర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ ను పరిశీలించారు. అనంతరం అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేస్తూ లాంగ్ పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని సూచించారు.
అధిక ఆస్థి సంబంధిత నేరాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లు గా గుర్తించి నిఘా కట్టుదిట్టం చేయాలని అన్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ సిబ్బంది ప్రతిఒక్కరూ అన్ని వర్టికల్ విభాగాలలో ప్రావీణ్యత కలిగి ఉండాలని, ఎవరికి కేటాయించిన పని ని వారు సక్రమంగా నిర్వర్తించినప్పుడే వర్టికల్ విభాగంలో ముందుకెళ్తామని సూ చించారు. సిటిజన్స్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారికి కనిపించే విధంగా ఉంచాలని అన్నారు.
అదేవిధంగా పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని వారిసమస్యను ఓపికగా విని సత్వర న్యాయానికి కృషి చేయాలని సూచించడం జరిగింది. కాగా షాపింగ్ మా ల్స్ , షాప్స్, పెట్రోల్ పంపులు లలో సిసి కె మెరాల ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. ఈ తనిఖీలో పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, అమీన్ పూర్ ఇన్స్పెక్టర్ నరేష్, ఎస్‌ఐలు, సిబ్బంది ఉన్నారు.