calender_icon.png 12 September, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచలో ప్రజా ఆరోగ్యంపై మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

12-09-2025 12:52:43 AM

  1. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు

కలుషిత నీరు, ఆపరిశుభ్రత 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11, (విజయక్రాంతి):ప్రజారోగ్యం పట్టని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. కలుషిత నీరు, అపరిశుభ్రతతో రోగాల బారిన పడుతున్నా జనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోందనీ ఆరోపణలు వెలువడుతున్నాయి.

కలుషితమైన తాగునీరు, అపరిశు భ్రమైన డ్రైనేజీలు, గుంతలమయమైన రోడ్లు, ప్రజలకు నిత్య నరకం చూపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాల్వంచలో విషజ్వ రాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు మరింత విజృంభించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కలుషితమైన నీరే.. రోగాలకు కారణం

పట్టణ ప్రజలకు తాగునీరు వారానికి ఒకసారి మాత్రమే వస్తోంది. ఆ నీరు కూడా తాగడానికి వీలు లేకుండా మురికిగా ఉంటోందని ప్రజలు వాపోతున్నారు. ఇది తగుదని ప్రతి రోడ్డుకి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అనుమతి లేకుండా ఇబడీ ముప్పడిగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసి ప్రజలను దగా చేస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు.

సుమారుగా 50 పైనే ఉంటాయి, వాటిలో అధిక శాతం లైసెన్స్ లేకుండానే ఏర్పాటు చేస్తున్నట్లు, లైసెన్సు ఉన్న నిబంధనలో పాటించని వారే అధికంగాక ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వీధిలోనూ కనీసం పదికి పైగా తాగునీటి పైపుల లీకేజీలు ఉన్నాయని, ఈ లీకేజీల కారణంగా మురికి కాల్వల నీరు తాగునీటిలో కలిసిపోయి కలుషితం అవుతోందని స్థాని కులు ఆరోపిస్తున్నారు.

దీనివల్ల ప్రజలు డయేరియా, టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడుతున్నారు.దోమల నివారణకు చర్యలు శూన్యం.. పాల్వంచను కార్పొరేషన్గా మార్చిన తర్వాత కూడా దోమల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మురికి నీరు నిలిచి ఉన్న డ్రైనేజీలు, గుంతలు దోమలకు నిలయంగా మారాయి. మున్సిపాలిటీ అధికారులు ఫాగింగ్ యం త్రాలు ఉన్నా వాటిని ఉపయోగించడం లేదని,

దీనివల్ల దోమల బెడద పెరిగిందని ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల దుస్థితి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అద్వానంగా మారింది. డ్రైనేజీలు మూసుకు పోవడంతో మురికినీరు రోడ్లపై పొంగిపొర్లుతోంది. దు ర్గంధం, అపరిశుభ్రత పెరిగి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా గుంతలు, రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు, పాదచారు లు ఇబ్బందులు పడుతున్నారు.

చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.ప్రజల  కోరిక.. అధికారుల స్పందనఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు, సంబంధిత ఉన్నతాధికారు లు స్పందించి తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కలుషిత నీటి సమస్య, డ్రైనేజీలు, రోడ్లు, దోమల బెడద వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పాల్వంచను ఆరోగ్యకరమైన పట్టణంగా మార్చడానికి అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.