16-09-2025 01:05:03 AM
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తు న్న చిత్రం ‘ఓజీ’. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నా రు. పవన్ కళ్యాణ్ గంభీరగా గర్జించనున్న ‘ఓజీ’ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి వంటి అద్భుతమైన తారాగణం ఉంది. సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ‘గన్స్ ఎన్ రోజెస్’ అనే గీతాన్ని విడుదల చేశారు. తమన్ ఎస్ స్వరపరిచిన ఈ పాట, శ్రోతలను అలరిస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస; కూర్పు: నవీన్ నూలి.