29-01-2026 01:04:44 AM
హెచ్‌సీఏకు బాంబే హైకోర్టు ఆదేశం
టీసీఏ సభ్యత్వ వివాద పరిష్కారం కేసు
ముంబై, జనవరి 28 : బీసీసీఐ జారీ చేసి న దీర్ఘకాలిక ఆదేశాల అమలు కోరుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసిషన్‌పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారించింది. తెలం గాణలో క్రికెట్‌కు సంబంధించి టీసీఏ నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకుని కలిసి పనిచేయాలంటూ బీసీసీఐ ఆదేశాలను హెచ్‌సీఏ పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అలాగే కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయడం లేదని టీసీఏ తరపు న్యాయవాది వివేక్ కాంతవాలా కోర్టు కు తెలియజేశారు. గత ఏడాది మార్చి 29న జరిగిన సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను పది నెలలుగా హెచ్‌సీఏ అందించ లేదని తెలిపారు. అలాగే తర్వాతి చర్యల కో సం టీసీఏ పంపించిన అనేక లేఖలకు సైతం ఎలాంటి స్పందన లేదన్నారు.
టీసీఏకు అనుకూలంగా బీసీసీఐ తరపున ఆదేశాలు జారీ అయినా హెచ్‌సీఏ అమలు చేయకపోవడంతో పదే పదే న్యాయస్థానాలను ఆశ్ర యించాల్సి వస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.హెచ్‌సీఏ నిరంతర నిర్లక్ష్యం, అవిధే యత దృష్ట్యా పిటిషన్‌ను స్వీకరించి టీసీఏకు బీసీసీఐలో అసోసియేట్ సభ్యత్వం ఇన్నాలని కోర్టును కోరారు. అన్ని వాదనలు పరిశీ లించిన అనంతరం చివరి నాలుగు వారాల గడువు ఇస్తూ సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని కోర్టు ఆదేశించింది. మార్చి 9కి ఒక వారం ముంగు రెండు పక్షాలు తమ తమ అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత కేసుపై తుది నిర్ణయం తీసుకుంటామనిస ఆదేశాలను పాటించని పక్షంలో బీసీసీఐకి ఆదేశాలు ఇవ్వడం లేదా తుది ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.