29-01-2026 01:06:56 AM
ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్, జనవరి 28 : మాజీ వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో రెండు సెట్లు కోల్పోయి వెనుకబడిన దశలో జకోవిచ్ ప్రత్యర్థి లొరెంజో ముసెట్టి(ఇటలీ) గాయం కారణంగా తప్పుకున్నాడు. అతను తప్పుకునే సమయానికి జకోవిచ్ 4 వెనుకబడి ఉన్నాడు. ముసెట్టి తప్పుకోవడంతో సెమీస్‌లో అడుగుపెట్టిన జకోవిచ్ 10వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచేందుకు రెండడుగుల దూరంలో నిలిచాడు.
అలాగే ఈ టైటిల్ గెలిస్తే కెరీర్‌లో 25వ గ్రాండ్‌శ్లామ్ సాధించిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టిస్తాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఇటలీకే చెందిన సిన్నర్ సెమీస్ చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో సిన్నర్ 6 స్కోరుతో అమెరికా ప్లేయర్ షెల్టన్‌పై విజయం సాధించాడు. ఇప్పటికే టాప్ సీడ్, స్పెయిన్ సంచలనం అల్కరాజ్, జ్వెరెవ్ కూడా సెమీస్ చేరుకున్నారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో జకోవిచ్ అల్కరాజ్ తలపడనున్నారు.