calender_icon.png 19 July, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు

19-07-2025 12:00:00 AM

నిజాంసాగర్, జూలై 18(విజయక్రాంతి ): తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు  తెలియపర్చే విధంగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట ఆదర్శ పాఠశాల లో శుక్రవారం విద్యార్థుల తో బోనాల ఉత్సవాలను నిర్వహించారు.  ప్రిన్సిపల్ కార్తీక సంధ్య ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

స్నేహ సొసైటీ ఆవరణంలో

నిజామాబాద్ జులై 18: (విజయ క్రాంతి): తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగని అని స్నేహ సొసైటీ సిద్దయ్య,  స్నేహ సొసైటీ అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి  అన్నారు. శుక్రవారం నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఆవరణంలో  బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.  ట్రాన్స్ జెండర్లు, వంశీ ప్రియ, సుచి  ప్రశాంతిలు బోనాలు ఎత్తుకున్నారు.