calender_icon.png 19 July, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాసిరకం పనులకు క్వాలిటీ సర్టిఫికెట్!

19-07-2025 12:00:00 AM

- నాణ్యత లేకుండా సీసీ రోడ్ల నిర్మాణం 

- చోద్యం చూస్తున్న అధికారయంత్రాంగం

మహబూబ్ నగర్ జూలై 18 ( విజయ క్రాంతి) : ప్రభుత్వ నిధులను ప్రజల సం క్షేమం కోసం వినియోగిస్తున్న తరుణంలో కొందరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా దు ర్వినియోగానికి గురి అవుతున్నాయి. పంచాయతీలలోని సిసి రోడ్ల నిర్మాణం నాణ్యత లేకుండా జరుగుతుందని గ్రామాల్లోని ప్రజ లు మొరపెట్టుకుంటున్న అధికారులు మా త్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నియమనిబంధనలు పక్కన పెట్టి ఎలాగో ఒకలా సిసి రోడ్డు పూర్తయితే చాలా అనేలా వ్యవహరిస్తున్నారని ఆ యా గ్రామాల ప్రజలు జిల్లా ఉన్నత అధికారులకు సైతం ఫిర్యాదులు చేస్తున్నారు. 

నిబంధనలు పాటిస్తే.. ఎందుకు గుంతల మయం..?

నియమ నిబంధనలను పాటిస్తూ సిసి రో డ్లు వేస్తే పంచాయతీల్లో పెద్ద పెద్ద లోడ్లతో కూడిన వాహనాలు ఏం ప్రతిరోజు ఏం తిరిగావు. చిన్నపాటి వాహనాలు పాదాచారులు మాత్రమే ఎక్కువగా గ్రామాలలోని గల్లీలలో తిరుగుతుంటారు. అధికారులు చెబుతున్న ట్టు నాణ్యత సర్టిఫికెట్లను సక్రమంగా అంది స్తూ బిల్లులకు సహకారం అందిస్తున్న సం బంధిత అధికారులు నిర్ణీత గడువు కంటే ముందుగానే సిసి రోడ్లు గుంతల మయంగా అవుతుంటే మరి ఎవరి నిర్లక్ష్యంగా గుంతల మయంగా మారుతున్నాయో సంబంధిత అధికారులే చెప్పాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యానికి నిలుటంలో అధికారులు వ్యవహరి స్తున్న తీరుకు గ్రామాల్లో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్వాలిటీ సర్టిఫికెట్ విభాగమంటారు, వివిధ శాఖల అధికారుల ప్రత్యే కతనిఖీలు అంటారు.. ఇలా ఇంతమంది ఉన్నతాధికారులు ఉండి పరిశీలన చేస్తుంటే నాణ్యత లేకుండా సిసి రోడ్లు ఎలా నిర్మాణం జరుగుతాయని ప్రజలు ప్రశ్నలకు అధికారు లు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. 

ఇలా వేస్తారు... అలా పోతున్నాయి..

సిసి రోడ్ల నిర్మాణం వేసినప్పటికీ నిర్ణీత గడువు లోపే దెబ్బతింటున్నాయి. అత్యవసరమున్న ప్రాంతాలలో ప్రాథమిక ఇవ్వ కుండా రోడ్డు వెయ్యాలంటే వేయాలి అనే వి ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. రోడ్డు వేయడంలో ఇసుక బదులు డస్ట్ వాడి కూ డా సీసీ రోడ్ల నిర్మాణం వేగంగా జరుపుతున్నారు. నిర్మాణం జరిగిన అనంతరం అధికా రులు నాణ్యత ప్రమాణాలను పాటించారని కొంత నాణ్యత లేదని తక్కువ శాతం కట్ చే స్తూ బిల్లు చేయడం జరుగుతుంది. నవమాత్రంగా తనిఖీలు చేపడుతూ క్వాలిటీ లేని రోడ్లకు క్వాలిటీ సర్టిఫికెట్లను సంబంధిత అధికారులు మంజూరు చేస్తున్నారు. ఇలా చేయ డం ద్వారా సీసీ రోడ్డు వేసిన తక్కువ కాలవ్యవధిలోని రోడ్లు గుంతల మయంగా మారు తున్నాయి. కాలక్రమవైపున అటువైపు చూసే అధికారులే కరువయ్యారు. ఇక కాంట్రాక్టర్లపై చర్యలు అంటే అది ఇప్పట్లో జరిగిన విష యం గాని తెలుస్తుంది. 

పర్యవేక్షణ చేస్తున్నాం...

సిసి రోడ్ల విషయంలో నాణ్యత ప్రమాదంలో పాటించేలా ఎప్పటికప్పుడు పర్యవే క్షణ చేయడం జరుగుతుంది. రాష్ట్ర , జిల్లా అధికారులు ఆదేశాల మేరకు నాణ్యత ప్ర మాదం పర్యవేక్షిస్తున్నాం. క్వాలిటీ సర్టిఫికెట్లను కూడా నిబంధనలు మేరకు అం దించ డం జరుగుతుంది. సిసి రోడ్ నియమ నిబంధనలు వేయాలని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లు సూచిస్తున్నారు. అవసరమైన ట్రిస్టులను కూడా చేస్తున్నాము. నిబంధనల మేరకు ముందుకు సాగుతున్న. 

       సురేందర్ రెడ్డి, డిఈ పంచాయతీ రాజ్ శాఖ, మహబూబ్ నగర్