18-07-2025 11:39:21 PM
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు
హనుమకొండ టౌన్,(విజయ క్రాంతి): రాష్ట్రంలో గురుకులాలలో విద్యార్థుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన మాచర్ల రాంబాబు ఆరోపించారు. హనుమకొండ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ... ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ప్రభుత్వ బిక్షం కాదని, విద్యార్థుల హక్కు అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్లో కొత్త నిబంధనలతో పాలిటెక్నిక్ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర పన్నుతున్నారు. కేయూ భూముల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కాళోజి నారాయణ హెల్త్ యూనివర్సిటీని వెంటనే ప్రక్షాళన చేయాలి అని అన్నారు.