08-08-2025 01:30:04 AM
హుస్నాబాద్, ఆగస్టు 7 : బడ్జెట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(బీస్మాట్) సిద్దిపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా హుస్నాబాద్‌లోని నవభారత్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ గంగారవేని రవి ఎన్నికయ్యారు. గురువారం బీస్మాట్ రాష్ర్ట జనరల్ సెక్రటరీ జగ్గు మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా రవి ఎన్నికపై నవభారత్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఆయనను శాలువాతో సత్కరించారు. బొకే, బహుమతి అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.