calender_icon.png 8 July, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒవైసీకి రూల్స్ వర్తించవా?

08-07-2025 12:27:18 AM

- అక్బరుద్దీన్‌కు ఒక న్యాయం..పేదలకు ఇంకో న్యాయమా..?

- ఆయన కాలేజీ భవనాన్ని కూల్చకుంటే.. మేమే ఆ పని చేస్తాం

- మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్ దాడులు దుర్మార్గం

- మీడియా సంస్థలపై చేయి వేస్తే టీ న్యూస్ ఛానల్ అంతుచూస్తాం

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు 

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): పాతబస్తీ సల్కం చెరువు భూమిలో అక్బరుద్దీన్ ఒవైసీ కాలేజీ కట్టిన మాట వాస్త వమేనని అంగీకరిస్తూనే..అందులో 10వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నందున వారి జీవితాలను నాశనం చేయలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం సమంజసం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు.

ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో, హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాల పరిధిలో వేలాది మంది పేదలు, చెరువు శిఖం భూములని తెలియక డబ్బు లు పెట్టి కొని ఇండ్లు కట్టుకున్నారన్నారు. మధ్య తరగతి, పేద ప్రజల ఇండ్లను ఎం దుకు కూలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

‘వాళ్లు మనుషులు కాదా.. వాళ్లవి జీవితాలు కావా.. వాళ్లకు కుటుంబాలు లేవా..అట్లాంటి వాళ్ల ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నరు... వాళ్ల జీవితాలను రోడ్డు పాలేందుకు చేస్తున్నారు..’అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ కాలేజీకి ఒక న్యాయం..పేదలకు మరో న్యా యమా..ఇదేనా కాంగ్రెస్ మార్క్ ఇందిరమ్మ రాజ్యమని నిలదీశారు. నిజంగా అందరికీ ఒకటే న్యాయమైతే అక్బరుద్దీన్ కాలేజీ భవనాన్ని ఎందుకు కూల్చరని నిలదీశారు.

గతే డాది నోటీసులిచ్చి గడువు పెట్టారు కదా.. విద్యా సంవత్సరం కూడా ముగిసిన వెంటనే కూల్చివేస్తే..ఆ కాలేజీ యాజమాన్యం వేరే బిల్డింగ్ చూసుకునేది కదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రత్యామ్నాయ కాలేజీల్లో అవకాశం కల్పించకుండా అక్బరుద్దీన్ చెరువులు, పేదల భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేసినా, దాదాగిరి చేసినా, చివరకు కరెంట్ బిల్లులు కట్టకపోయినా, తీవ్రవాదులకు ఆశ్రయమిచ్చినా వాళ్లకు రక్షణ కల్పిస్తామంటే చూస్తూ ఊరుకోవాలా అని అన్నారు. తక్షణమే అక్బరుద్దీన్ కాలేజీని కూల్చివేయాలని లేదంటే ప్రజల తరఫున బీజేపీ ఆ పనిచేస్తుందని హెచ్చరించారు. 

మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్ మూకల దాడులు..

ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్ మూకలు దాడులకు తెగబ డుతున్నాయని తమకు పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని..బీఆర్‌ఎస్ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించినా బుద్ధిరాలేదన్నారు.

మొన్న మహా న్యూస్‌పై దాడులు చేశారని..ఇప్పుడు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై దాడులు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. అవసరమేతే మీడియా సంస్థలకు బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. తక్షణమే ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయాలకు తగిన రక్షణ కల్పిం చాలని యువ మోర్చా నాయకులకు తాను ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. 

టీన్యూస్ భూస్థాపితం అయ్యేది..

మీడియా సంస్థలపై దాడులకు సంబంధించి రాంచందర్‌రావు బీఆర్‌ఎస్ నాయకు లను హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇకపై మీడి యా సంస్థలపై, అమాయక ప్రజలపై దాడు లు చేశారో ఖబడ్దార్.. మీ అంతు చూస్తాం. మీలాగే మేం ఆలోచిస్తే మీ బూతు ఛానల్ టీ న్యూస్‌ను ఎప్పుడో భూస్థాపితం చేసే వా ళ్లం. కానీ మీడియా సంస్థలను బీజేపీ గౌరవిస్తుంది. మాకు వ్యతిరేకంగా రాసినా, కథనాలు ప్రచారం చేసినా తప్పులుంటే సరిదిద్దుకుంటాం. కావాలని తప్పుడు వార్తలు రాస్తే చట్ట, న్యాయపరంగా ముందుకెళ్తామే తప్ప దాడులు చేయబోమన్నారు.