calender_icon.png 8 July, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జవహర్‌నగర్‌లో త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం..

08-07-2025 12:28:05 AM

గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జులై 7 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లోని జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ వెల్లడించారు. ఎస్‌ఆర్టీ జవహర్‌నగర్ వ్యాయా మశాల, ఆట స్థలం, కళ్యాణ మండప పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు నర్మేట మల్లేష్ మాట్లాడుతూ గత 7 నెలలుగా కమ్యూనిటీ హాల్ రెన్నోవేషన్ కొరకు నిధుల మంజూరుకు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతో జీహెఎంసి కమిషనర్, జోనల్ కమీషనర్ సహకారంతో సుమారు రూ. 26 లక్షల నిధులు మంజూ రు చేయించారని తెలిపారు.

త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని పనులు ప్రారంభించేందుకు కార్పొరేటర్ చర్యలు తీసుకుంటు న్నారని అధ్యక్షుడు మల్లేష్ వివరించారు. ఈ సమావేశంలో  బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, ఎస్‌ఆర్టీ  జవహర్‌నగర్ వ్యాయామశాల, ఆటస్థలం, కళ్యాణ మండప పరిరక్షణ కమిటీ సభ్యులు కృష్ణ, మహేందర్, సలీమ్, శ్రీకాంత్, రాజు, మధన్, రాము పాల్గొన్నారు.