18-08-2025 11:04:58 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో సోమవారం గౌడ కులస్తులు కాటమయ్యకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వందలాది మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని బొడ్రాయి చుట్టు ప్రదక్షిణాలు నిర్వహించి అనంతరం అక్కాచెల్లెళ్ల చెరువు సమీపంలోని కాటమయ్య గుడికి చెరువు కట్టమీదగా తరలివెళ్లి బోనాలు సమర్పించారు. బోనాల సందర్భంగా మండల కేంద్రంలో శివసత్తుల పూనకాలతో పోతరాజు విన్యాసాలతో ఊరేగింపులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు పాల్గొన్నారు.