calender_icon.png 19 August, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా మండల స్థాయి కృత్యమేళా

19-08-2025 12:00:00 AM

నర్సంపేట ఆగష్టు 18 (విజయ క్రాంతి) ః నల్లబెల్లి మండలంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులచే కృత్యమేళా ను నిర్వహించారు. ఈ కృత్యమేళాకు మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించేందుకు వీలుగా టిఎల్‌ఎం తయారుచేసి ప్రదర్శించడం జరిగింది.

మేరకు నల్లబెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కృత్య మేళాకు నల్లబెల్లి మండల ఎంఈఓ అనురాధ పాల్గొని ప్రారంభించారు.  ఈ కృత్య మేళలో నల్లబెల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వసంత, మేడపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, ఆయా పాఠశాలల నుంచి సబ్జెక్టుకు ఒకరు చొప్పున ఉపాధ్యాయులు, ఎంఆర్సి సిబ్బంది, సిఆర్పిలు పాల్గొన్నారు.