19-08-2025 12:00:00 AM
మంత్రి సీతక్క
ములుగు, ఆగస్టు 18 (విజయక్రాంతి) : ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ర్ట పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీ ణ నీటి సరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నా రు.
ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం సర్దార్ సర్వా యి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా చాలా సంతోషకరమని అన్నారు.
కన్నాయిగూడెంలో జెండా ఆవిష్కరణ
కన్నాయిగూడెం, ఆగస్టు 18 : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవులా గ్రామంలో కల్లుగీత కార్మికుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది.అనంతరం సర్వాయి పాపన్న 375 వ జయంతి జరిగింది. ఈ కార్యక్రమం మండల ఉపాధ్యక్షుడు తాటి లచ్చలు గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల అధ్యక్షులు పాలకుర్తి శ్రీధర్ గౌడ్ మండల గౌరవ అధ్యక్షులు మారగొని రాజు గౌడ్, పాలకుర్తి శ్రీధర్ గౌడ్, మండల కార్యదర్శి తాటి యాదగిరి గౌడ్ ప్రధాన కార్యదర్శి తాటి రాజశేఖర్ గౌడ్ కోశాధికారి బత్తిని ఎల్లాస్వామి గౌడ్ సొసైటీ అధ్యక్షులు తండ ప్రభాకర్ గౌడ్ పాలకుర్తి కుమారస్వామి గౌడ్ పాలకుర్తి వెంకటేశ్వర్లు గౌడ్ పాలకుర్తి మధు గౌడ్ పాలకుర్తి బిక్షపతి గౌడ్ తాటి రాజబాబు గౌడ్ తడూరి శ్రీధర్ గౌడ్ తాటి కనకసేన గౌడ్ తాటి నాగేష్ గౌడ్ కోడూరు చంటి గౌడ్ కొరకొక్కుల దీపక్ గౌడ్ తాటి రాజు గౌడ్ అరెళ్ల బాలరాజు గౌడ్ పాలకుర్తి సంతోష్ గౌడ్ పాల్గొన్నారు.
సామాజిక న్యాయం కోసం కృషిచేసిన సర్దార్ సర్వాయి పాపన్న
మహబూబాబాద్, ఆగస్టు 18 (విజయ క్రాంతి): సామాజిక న్యాయమే లక్ష్యంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాపన్న చిత్రపటానికి అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, బీసీ సంక్షేమ అధికారి నరసింహస్వామి, గౌడ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భూపాలపల్లి లో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సర్దార్ సర్వా యి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, బీసీ సంక్షేమ శాఖ అధికారి క్రాంతి కిరణ్, గౌడ సంఘం ప్రతినిధు లు ప్రభాకర్ గౌడ్, అశోక్, పాల్గొన్నారు.
మరిపెడలో..:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడిలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు రేఖ శ్రీనివాస్, గౌడ సంఘం పెద్దలు బోడ పట్ల రవి, కందాల రమేష్, రేఖ వెంకన్న, బయ్య, పిచ్చయ్య, భయ్యా పాపారావు, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బడుగుల ఆత్మగౌరవానికి ప్రతీక పాపన్న గౌడ్
తరిగొప్పుల, ఆగస్టు 18 (విజయ క్రాంతి): తెలంగాణలోని బలుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి వీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్ అని ఎస్సు గుగులోత్ శ్రీదేవి అన్నారు. రైతులకు జరిగిన అన్యాయం పై నిజాంతో పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని ఆ మహనీయుని సేవలు మరువ లేనివని ఎస్సు అన్నారు. మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు తాళ్లపల్లి పోచయ్య గౌడ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్సు శ్రీదేవి సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జొన్న గొని శ్రీనివాస్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పింగిలి జగన్మోహన్ రెడ్డి, చిలువేరు లింగం, తాళ్లపల్లి రాజేశ్వర్ గౌడ్, అర్జుల మధుసూదన్ రెడ్డి, ముద్దసాని వెంకటరెడ్డి, దామెర ప్రభుదాస్, బత్తిని సురేందరు, వంగ రామరాజు, ఆవుల శ్రీను,జాగిరి మల్లయ్య, కొయ్యడ రాజు, జాగిరి రాజు, తీగల లింగం, జాగిరి వెంకటేశ్వర్లు, వంగ భీమయ్య, బుస యాదగిరి, నేతుల సత్తయ్య, అంకం రాజారామ్, తదితరులు పాల్గొన్నారు.