calender_icon.png 18 August, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు

17-08-2025 10:53:14 PM

ఒక పార్టీకే వత్తాసుపలుకుతుండ్రు

బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ దివాకర్ రావు

మంచిర్యాల,(విజయక్రాంతి): బీఆర్ఎస్ నాయకులపైన పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. ఆది వారం సాయంత్రం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావుతో కలిసి ఆయన మాట్లాడారు.

హాజీపూర్ మండలం రాపల్లిలో ఈ నెల 14న జరిగిన పెళ్లి భరత్ లో గొడవకు కారణమని బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయడం చట్ట విరుద్దమన్నారు. ఆ గొడవ సమయంలో లేని వారిపై కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై కేసులు పెడతామని, ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీసులపై సీపీ దృష్టి సారించాలని కోరారు.