calender_icon.png 21 July, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టేడియం మైదానంలో తాగునీటి గోస

21-07-2025 01:20:18 AM

  1. మీరే రావడం లేదు... తాగునీరు వృథా చేయకండి.. 

రోజు వేలాదిగా క్రీడాకారులు, వాకర్స్ 

పట్టించుకోని డిఎస్డివో శ్రీనివాస్ 

మహబూబ్ నగర్ టౌన్ జూలై 20 (విజయ క్రాంతి) : జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నందు తాగునీటి కోసం తీవ్రంగా ఉంది. ఉదయం సాయంత్రం క్రీడాకారులతో పాటు వాకర్స్ వేలాదిగా స్టేడియం మైదానంకు వస్తుంటారు. ఇక్కడ తాగునీరు వృధా చేయకండి..చేతులు కాళ్లు కడగరాదు.. అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసి అక్కడ తాగునీటి కుళాయిలో మాత్రం నీరు రావడం లేదు.

నిత్యం క్రీడాకారులు క్రీడా మైదానంలో వివిధ క్రీడల్లో పాల్గొని తాగునీరు కావాలంటే ప్ర ధాన రోడ్డుపైకి వెళ్లి వివిధ హోటల్స్ ను ఆశ్రయించి తాగునీరు తాగే పరిస్థితి నెలకొంది. ఇండోర్ స్టేడియం తో పాటు, బాక్సింగ్, కబడ్డీ, స్విమ్మింగ్ పూల్, వాలీబాల్, సాఫ్ట్బాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ తోపాటు వివిధ క్రీడలు నేర్చుకునేందుకు క్రీడాకారులు ఎంతోమంది వస్తుంటారు.

కాగా ఇక్కడ తాగునీటి ఘోషను మాత్రం పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని పలువురు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగేందుకు అక్కడ ఒక గ్లాస్ కూడా ఏ ర్పాటు చేయకపోగా తాగునీరు కూడా ఉంచలే ఉంచడం లేదు. బిఎస్డిఓ ఇప్పటికైనా స్పందించి నిత్యం తాగునీరు ఉండడంతో పాటు తాగేందుకు వీలు అయ్యల అవసరమైన చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు. వాకర్స్‌కోరుతున్నారు.