18-11-2025 06:20:33 PM
మారకద్రవ్యాల నియంత్రణపై ప్రతిజ్ఞ
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి (విజయక్రాంతి): సమాజంలో మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో మారకద్రవ్యాల నిరోధక అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశానికి హాజరైన వారితో మారక దవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేపట్టారు. ఎక్కడైనా మారకద్రవ్యాలు వినియోగం గమనిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఐసిడిఎస్ తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.