09-12-2025 01:17:52 AM
విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): విద్యార్థులకు పుస్తకాలు చదవడం అలవాటుగా మారాలని, అప్పుడే వారు భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా ఎదిగేందుకు అ వకాశం ఉంటుందని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు అన్నా రు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో సోమవారం డిజిటర్ లైబ్రరీని ప్రారంభించారు.
ఈ సందర్భం గా ప్రొఫెసర్ దాసేశ్వర రావు మాట్లాడుతూ.. విజ్ఞాన కేంద్రాలైన గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లై బ్రరీకి వెళ్లి దినపత్రికలు, రిఫరెన్స్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పాఠ్య పుస్తకాలే కాకుండా వ్యక్తిత్వ వికాసం కోసం.. అబ్దుల్ కలామ్, స్వామి వివేకానంద వంటి మహనీయుల జీవిత చరిత్రలు చదవాలన్నారు.
కథలు, కవితలు, వ్యా సాలు చదవడం ద్వారా సృజనాత్మకత, ఆ లోచనా శక్తి పెరుగుతుందని చెప్పారు. గ్రం థాలయాలు విద్యార్థులలో పఠనాసక్తిని పెం పొందిస్తాయని, వివిధ విషయాలపై సమగ్ర జ్ఞానాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు కెరీర్లో ఉన్నత స్థాయిలకు ఎదగడంతో పాటు మంచి విలువలను పాటించాలంటే ఉత్తమ పుస్తకాలను చదవాలని చెప్పారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, అధిపతులు పాల్గొన్నారు.