calender_icon.png 9 December, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువభారతి గ్రంథాలు చదవాలి

09-12-2025 01:16:29 AM

  1. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి 
  2. ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి 

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ప్రాచీన, ఆధునిక తెలుగు సాహి త్యం గురించి తెలుసుకోవాలంటే యువభారతి ప్రచురించిన గ్రంథాలు చదివితే సరిపో తుందని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. జంట నగరాల్లోని ఇతర సాహిత్య సంస్థలతో కలిసి యువభారతి తెలుగు వెలుగు సమాఖ్యగా ఏర్పడి ప్రతి నెలా మొదటి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 14వ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ప్రసంగిం చారు. ఈ కార్యక్రమానికి యువభారతి వ్యవస్థాపక సమావేశకర్త ఆచార్య వంగపల్లి విశ్వనాథం అధ్యక్షత వహించారు. ప్రసిద్ధ పద్యకవి డాక్టర్ రాజశ్రీ రచించిన నల్లగుట్ట శ్రీహరి కూర్మనాథ స్వామి శతకాన్ని ఎల్లూరి శివారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల పూర్వ ప్రాచార్యులు డాక్టర్ సంగనభట్ల నర్సయ్య..

చిలకమర్తి లక్ష్మీనరసింహం గయోపాఖ్యానం నాటిక వైశిష్ట్యాన్ని గురించి ప్రసంగించారు. డాక్టర్ రాధశ్రీ కావ్యాన్ని గురించి యువభారతి అధ్యక్షులు డాక్టర్ ఆచార్య ఫణీంద్ర సమీక్షించారు. ఐఐఎంసి కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘువీర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రచురితం కాని దాశ రథి కృష్ణమాచార్య రచనలను త్వరలో యు వభారతి ప్రచురణగా తీసుకు రానున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాధన నరసింహాచార్య, కెవిఎన్ ఆచార్య, యువభారతి కార్యదర్శి జీడిగుంట వెంకట్రావు, సాహితీవేత్త చీకోలు సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.