06-01-2026 07:15:17 PM
అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి
నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
మణుగూరు,(విజయక్రాంతి): మండలంలో రెడ్డి సంక్షేమ సమాఖ్య, అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తామని, సంఘం మండల అధ్యక్షులు నాసిరెడ్డి విజ యభాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సమాఖ్య రూపొందించిన నూతన సంవత్సర 2026 క్యాలెండర్, డైరీని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అందరికీ నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఆకాంక్షించారు. త్వరలోనే మండల కేంద్రంలో రెడ్డి సంక్షేమ సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఆయన పేర్కొన్నారు. రెడ్డి కులస్తుల సంక్షే మానికి ఐక్యంగా పోరాడాలని, సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు సహాయ, సహకారం అందించేలా చూడాలన్నారు.
ఆపదలో ఉన్న కులస్తులను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఏర్పడి నప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండి పరిష్క రించుకోవాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిధులను సంక్షేమ సమాఖ్య పక్షాన శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలోరెడ్డి సంక్షేమ సమాఖ్య గౌరవ అధ్యక్షులు ముల్లంగి శివారెడ్డి, ఉడుముల తిరుపతిరె డ్డి, సిరపు గణేశ్ రెడ్డి,సామా శ్రీనివాసరెడ్డి, ఆలేటి అశోక్ రెడ్డి, గాయం అవినాష్ రెడ్డి, శ్యామల అశోక్ రెడ్డి,సురేందర్ రెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, గ్యాస్ కొండారెడ్డి,కోటా రాము,బంకు శ్రీనివాస్ రెడ్డి, ఆదిరెడ్డి,ఆది నారాయణ రెడ్డి, రెడ్డెం శంకర్ రెడ్డి, శ్యామ ల రామిరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఆవుల ప్రతా పరెడ్డి, యాకూబ్ రెడ్డి పాల్గొన్నారు.