calender_icon.png 21 December, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విల్లువిన్నర్స్ @ కల్లెడ ఆర్డీఎఫ్

21-12-2025 12:43:12 AM

పల్లె నుంచి ఒలంపిక్స్‌కు.. ఆర్చరీ జయకేతనం

వరంగల్ జిల్లాలో ఆ ఊరు పేరు విలువిద్యకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. పట్టుదల ఉంటే ఎంతటి మహత్కార్యమైనా సాధించవచ్చని మట్టిలోమాణిక్యాలు నిరూపించారు. చిన్నతనం నుంచే చదువుతోపాటు విలువిద్యలో ప్రావీణ్యం పొందే లా ఆ పాఠశాలలో విభిన్న తరహాలో ఆర్చరీకి ప్రా ధాన్యం ఇచ్చారు. ఇక్కడ పొందిన నైపుణ్యంతో ‘విల్లు ఎక్కుపెట్టి.. బాణం సంధిస్తే లక్ష్యాలను ముద్దా డి.. పతకాల వర్షం కురువాల్సిందే!  పల్లె నుంచి ఒలంపిక్స్‌లో విలువిద్య పోటీలో వర్ధినేని ప్రణీత ఘనత.. వరంగల్ జిల్లా కల్లెడ ఆడ్డీఎఫ్ స్కూల్ కీర్తి ఖండాంతరాలను దాటి విశ్వవ్యాప్తమైంది. విలువిద్య(ఆర్చరీ) క్రీడకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.

చదువు ఒక్కటే కాదు సమాజంలో గుర్తింపు పొందేందుకు ఆటలు కూడా ఎంతో ముఖ్యమని, అందులోనూ ప్రత్యేకత సాధించే విధంగా తమ విద్యార్థులు ఉండాలని లక్ష్యంతో మార్మూల గ్రామమైన కల్లెడలో ఫౌండర్ ఎర్రబెల్లి రామ్మోహన్ రావు వినూత్న ఆలోచనతో 1996లో కల్లెడ రూరల్ ఫౌండేషన్ (ఆడ్డీఎఫ్) సంస్థను ఏర్పాటు చేశారు. ఆయ న ఆలోచనలకు అనుగుణంగానే తొలుత విద్యాలయాన్ని ప్రారంభించారు. చిన్నతనం నుంచే పాఠశా ల స్థాయిలోనే చదువుతోపాటు విద్యార్థులు ఆట ల్లో రాణించడానికి కృషిచేశారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్ తదితర క్రీడలపై విద్యార్థులు అమితాసక్తి కనబరిచారు.

దీంతో పాటు నగరాలు పట్టణాలకే పరిమితమైన ఆర్చరీ క్రీడలో విద్యార్థులను తీర్చిదిద్దాలని రామ్మోహన్‌రావు సం కల్పించి 2002లో కల్లెడలో ఆర్చరీ శిక్షణ ప్రారంభించారు. ఆర్చరీ క్రీడకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండడంతో ఈ క్రీడలో విద్యార్థులు రాణిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తా యని, ఈ ప్రాంతంలో విలువిద్య ప్రారంభిస్తే ఆసక్తి కూడా పెంపొందుతుందని తపిస్తూ.. కార్యసాధకుడై సాగాడు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రత్యే కంగా కోచ్ ప్రభీర్ దాస్‌ను ఇక్కడికి తెప్పించి, పాఠశాల స్థాయి నుంచే ఆర్చరీ క్రీడలో విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు.

అనంతరం రేణు మండల్ ఆధ్వర్యం లో శిక్షణ కొనసాగించారు. ఫలితంగా మార్మూ ల పల్లెల నుంచి పాఠశాల స్థాయిలోనే మట్టలో మాణిక్యాలైన పిల్లల ప్రతిభకు విలువిద్యలో పదు ను పెట్టారు. ప్రావీణ్యం సాధించి కల్లెడ పరిసర ప్రాం తాలకు చెందిన అనేకమంది క్రీడాకారులు విలువిద్య (ఆర్చరీ)లో జాతీయ, అంతర్జాతీ య స్థాయి లో గుర్తింపు పొందారు. వీరిలో వర్ధినేని ప్రణీత అత్యంత్య ప్రావీణ్యం పొందింది. ప్రణీత ఏకంగా 2008 బీజింగ్ ఒలంపిక్స్ క్రీడలో పాల్గొని ఆర్చరీలో సత్తాచాటడంతో వరంగల్ జిల్లా కల్లెడ పేరు విశ్వవ్యాప్తమైంది. అనేకమంది విద్యార్థులు చిన్నతనం నుంచి ఆర్చరీ క్రీడలో రాణించడంతోపాటు చక్కగా చదువుకొని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. 

పాఠశాల, కళాశాలలో ప్రత్యేక శిక్షణ   

కల్లెడ ఆర్డీఎఫ్ పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యార్థులకు విలువిద్యలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తు న్నారు. కల్లెడ ఆర్డీఎఫ్ పాఠశాలలో విశాలమైన ప్రాంగణంలో జాతీయ, అంతర్జాతీయ, ఒలంపిక్ స్థాయిలో ఆర్చరీ క్రీడలో రాణించే విధంగా శిక్షణ కేంద్రం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆర్చరీ క్రీడలో శిక్షణకు అవసరమైన ఆధునికమైన బో (ధనుస్సు), రి కర్వ్ బో, కాంపౌండ్ బో, ట్రెడిషనల్ బో, వివిధ రకాల బాణాలు, క్వీవర్, ఆర్మ్ గార్డ్, ఫింగర్ గ్లోవ్, సైట్, స్టెబిలైజర్, చెస్ట్ గార్డ్, బో స్ట్రింగర్, బోకి స్ట్రింగ్, టార్గెట్, రౌండ్ టార్గెట్ తదితర సౌకర్యాలను, పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు.

దీంతో శిక్షణ పొందే విద్యార్థులు విభిన్న పోటీలకు సులువుగా తర్ఫీదు పొందడానికి అనువుగా ఉంది. ప్రస్తుతం ఇదే పాఠశాలలో చదివి ఆర్చ రీ క్రీడలో శిక్షణ పొంది, 15 సార్లు జాతీయ పోటీ ల్లో పాల్గొని, 2018 నుంచి 2022 వరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అకాడమీకి  కల్లెడకు చెందిన సీనియర్ క్రీడాకారుడు బండారి భరత్ సెలె క్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఇతను శిక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మరికొంత మంది విద్యార్థు లు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా తర్ఫీదు పొందుతున్నారు. 

జాతీయ, అంతర్జాతీయ స్థాయికి..

కల్లెడ ఆర్డీఎఫ్ పాఠశాలలో చదువుతూ ఆర్చరీ క్రీడలో నైపుణ్యం సాధించి 2008లో పర్వతగిరి గ్రామానికి చెందిన వేమునూరు శారద అమెరికాలో జరిగిన ప్రపంచ స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. అలాగే 2013లో చైనాలో జరిగిన జూనియర్స్ పోటీలో ప్రతిభ కనబర్చారు. దేశ రక్షణ విభాగంలో విధులు నిర్వహి స్తోంది. రావూరు గ్రామానికి చెందిన నోముల లావణ్య ఇక్కడ శిక్షణ పొందిన అనంతరం 2011 లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా శిక్షణ పొంది, 2012లో చైనా వరల్డ్ కప్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించింది.

అలాగే 2014లో జరిగిన జూనియర్ విభాగంలో కూడా ఆమె పాల్గొంది. కల్లెడకు చెందిన ఆదోండ రాజు 2003 నుంచి కల్లెడ ఆర్డీఎఫ్ పాఠశాలలో చదువుకుంటూ ఆర్చరీ క్రీడ లో శిక్షణ పొంది మెక్సికోలో 2006 లో జరిగిన సబ్ జూనియర్ వరల్డ్ కప్ పోటీల్లో రజత పతకం సాధించా డు. అలాగే 2007లో చైనాలో జరిగిన చాంపియన్‌షిప్ పోటీల్లో వెండి పతకం సాధించాడు. ఆ తర్వాత ఇరాన్ దేశంలో జరిగిన ఏషియ న్ గ్రాండ్ ఫిక్స్ పోటీల్లో భారత జట్టు తరఫున గోల్డ్‌మెడల్ కొట్టాడు. అలాగే పలు ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రస్తుతం రైల్వే ఉద్యోగిగా స్థిరపడ్డాడు.

ఇక కల్లెడకు చెందిన ముద్రబోయిన రంజిత్ కుమార్ 2014లో సౌత్ కొరియాలో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ ఆర్చరీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఇదే గ్రామానికి చెందిన సుంకరి లావణ్య 2013లో జరిగిన ప్రపంచ స్థాయి సబ్ జూనియర్ ఆర్చరీ పోటీల్లో భారత జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించింది. కల్లెడ ఆర్డీఎఫ్ పాఠశాలలో అనేక మంది చదువుకుంటూ ఆర్చరీలో జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభను చాటి, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడ్డారు.

ఒలంపిక్ వేదికపై ప్రణీత సత్తా

కల్లెడకు చెందిన వర్దినేని ప్రణీత భారత ఆర్చరీ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటి మహి ళ ఒలంపిక్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కల్లెడ ఆర్డీఎఫ్ పాఠశాలలో చదువుతోపాటు ఆర్చరీ క్రీడలో ప్రావీణ్యం సాధించిన ప్రణీత 2008 బీజింగ్‌లో జరిగిన ఒలంపిక్స్‌లో భారత దేశానికి ప్రాతినిథ్యం వహించారు.

2004లో సబ్ జూనియర్ నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించి టాటా ఆర్చరీ అకాడమీలో చేరే అవకాశాన్ని దక్కించుకొంది. 2008లో, 2010లో, 2009, 2010లో అనేక పోటీల్లో ఎన్నో పతకాలు సాధించింది. ప్రణీత ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్చరీ కోచ్‌గా గచ్చిబౌలి స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌లో పనిచేస్తోంది.

 సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి

ఉచితంగా శిక్షణ, బాలికలకు హాస్టల్ ఫీజులో రాయితీ

కల్లెడ ఆర్‌డీఎఫ్ పాఠశాల/కళాశాలలో విద్యనభ్యసిస్తూ ఆర్చరీ క్రీడలో శిక్షణ పొందే విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. బాలికలకు హాస్టల్ ఫీజులో రాయితీ ఇస్తున్నాం. అలాగే జిల్లా స్థాయి మొదలుకొని జాతీయ స్థాయి వరకు ఆర్చరీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు పూర్తిగా రవాణా ఖర్చులు భరిస్తున్నాం.

ఆర్‌డీఎఫ్ చైర్మన్ ఎర్రబెల్లి రామ్మోహన్ రావు కృషితో దాతల సహకారంతో ఆర్చరీ క్రీడలో రాణించే విధంగా విద్యార్థులకు ప్రత్యేకంగా న్యూట్రిషన్ ఫుడ్ అందజేస్తున్నాం. అత్యాధునిక క్రీడా సామగ్రితో శిక్షణ కేంద్రం నెలకొల్పాం. ఒలంపిక్స్ క్రీడలో ఆడ్డీఎఫ్ ద్వారా శిక్షణ పొందిన క్రీడాకారులు పతకాలు సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. 

 జనార్దన్, ప్రిన్సిపాల్, ఆర్డీఎఫ్ పాఠశాల, కల్లెడ