calender_icon.png 5 May, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హార్వెస్టర్ ఢీకొని బాలుడి మృతి

05-05-2025 01:36:01 AM

చేగుంట, మే 4 :హార్వెస్టర్ ఢీకొనడంతో చిన్నారి బాలుడు మృతి చెందిన ఘటన చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో ఆదివా రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే...చిన్న శంకరంపేట్ మండలం శాలిపేటకు చెందిన మా లే హర్షిత్( 6) ఈనెల 1వ తేదీన తన మేనమామ పెళ్లికి తన తల్లిదండ్రులతో  కలసి ఇబ్రహీంపూర్ గ్రామానికి వచ్చాడు.

ఆదివారం ఉదయం గ్రామంలో హార్వెస్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా వెనుకకు తీస్తున్న క్రమంలో వెనక ఉన్న హర్షిత్ ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలు సుకున్న చేగుంట ఎస్త్స్ర  జి, చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికితరలించారు.

లారీ ఢీకొని కార్మికుడి మృతి 

చేగుంట, మే 4:లారీ ఢీకొని కార్మికుడు మృతి చెందిన సంఘటన చేగుంట మండల పరిధిలోని జాతీయ రహదారి 44పై ఆదివారం జరిగింది. మాసాయిపేట మండలం పోతాన్పల్లి గ్రామానికి చెందిన తలారి అశోక్ (30) జిఎంఆర్ లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

కాగా బంగారమ్మ ఆలయం వద్ద హై దరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామాయంపేట సిఐ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించగా, చేగుంట ఎస్.ఐ కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.