05-05-2025 01:37:08 AM
హైదరాబాద్, మే 4 (విజయక్రాం తి): ఎప్‌సెట్ పరీక్షలు ముగిశాయి. ఆదివారం చివరిరోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు పరీక్ష జరిగింది. ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించగా, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ అభ్యర్థులకు పరీక్షలు జరిగాయి. అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలకు 86,762మంది దరఖాస్తు చేసుకోగా అందులో 81,198 (93.59 శాతం) మంది పరీక్షకు హాజరుకాగా, 5564 మంది డుమ్మా కొట్టా రు.
ఇంజినీరింగ్‌కు 2,20,327 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 2,07,190 (94.04 శాతం) మంది పరీక్షకు హాజరవగా, 13,137మంది గైర్హాజరయ్యారు. ఈనెల 15న ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరీక్ష మధ్యలో అక్కడక్కడ సర్వర్ డౌన్ మినహా ఎటువంటి సమస్యలు తలెత్తలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించి మ్యాథ్స్, కెమిస్ట్రీ నుంచి కొన్ని పెద్ద ప్రశ్నలు రావడంతో విద్యార్థులు కాస్త ఇబ్బంది పడినట్లు తెలిసింది.