18-08-2025 12:00:00 AM
పటేల్ గూడ హరివిల్లు టౌన్ షిప్ లో ఘటన
పటాన్‌చెరు (అమీన్‌పూర్), ఆగ స్టు 17 : అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ హరివిల్లు టౌన్‌షిప్‌లో రెండవ అంతస్థు నుంచి హర్షవర్దన్(5) అనే బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వనపర్తి జిల్లా బలజపల్లి గ్రామానికి చెందిన మింగ గురుమూర్తి, నందిని దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి రెండు నెలల క్రితం హరివిల్లు టౌన్ షిప్ లో భవనం రెండవ అంతస్థులో ఓ పోర్షన్ అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
గురుమూర్తి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే గురుమూర్తి డ్రైవింగ్‌కు వెళ్తుండగా కొడుకు హర్షవర్దన్ బిల్డింగ్ రేలింగ్ పట్టుకొని ఆడుకుంటున్న క్రమంలో అదుపుతప్పి గేటుపై పడడంతో తల కు తీవ్ర గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతిచెందాడు. అల్లారు ము ద్దుగా పెంచుకున్న కొడుకు కండ్ల ముందే విగత జీవిగా పడి ఉండడం తో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాలనీ వాసులు తక్షణ సాయంగా అప్పటికప్పుడు రూ.35 వేలు అందజేశారు.