calender_icon.png 6 May, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి

06-05-2025 12:06:38 AM

రేవల్లి, మే 5 : మండల పరిధిలోని కేశంపేట గ్రామానికి చెందిన భరత్ కుమా ర్(10) ప్రమాదవశాత్తు తాను ప్రయాణిస్తున్న ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన ఘట న ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. 

ఎస్త్స్ర రజిత వివరాల ప్రకారం కేశంపేట కు చెందిన శంకర్ ఆదివారం రాత్రి పాతతాండ రోడ్డు లో ఉన్న పొలం దగ్గరున్న వడ్లపై తడవకుండ కవర్ కప్పడానికై తన కుమారులైన రాజు,భరత్ లతో కలిసి వెళ్ళాడు, రాత్రి 08 గంటల సమయంలో పొలం నుండి ఇంటికి వెళ్లేటప్పుడు శంకర్ బైక్ పైన వెళ్ళగా ఇద్దరు  కొడుకులు రాజు, భరత్ కుమార్ లను  ట్రా క్టర్ డ్రైవరు రాముడు  ట్రాక్టర్ ఇంజిన్ పైన ఇద్దరు పిల్లలను  కూర్చోబెట్టుకొని గ్రామాని కి వస్తుండగా మార్గ మద్యాలో ఎదురుగా వాహనం రావడంతో సడన్ బ్రేక్ వేశాడు.  ట్రాక్టర్‌పై కూర్చున్న మృతుడు భరత్ కుమా ర్ జారీఅదే ట్రాక్టర్ వెనక టైర్ కిందపడి మృతిచెందాడు, ఈ విషయమై మృతుని తండ్రి పిర్యాదు మేరకు ట్రాక్టర్ ను నిర్లక్ష్యం గా నడిపిన డ్రైవరు రాముడు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.