calender_icon.png 26 December, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కివీస్ వన్డే కెప్టెన్‌గా బ్రేస్‌వెల్

26-12-2025 01:37:32 AM

భారత్ టూర్‌కు జట్టు ప్రకటన

వెల్లింగ్టన్, డిసెంబర్ 25 : వచ్చే నెలలో భారత పర్యటన కోసం న్యూజిలాండ్ జట్టు ను ప్రకటించారు. ఇటీవల వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌తో పోలిస్తే పలు మా ర్పులు చోటు చేసుకున్నాయి. వెటరన్ ప్లేయ ర్ కేన్ విలియమ్సన్ సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడేందుకు మొగ్గుచూపడంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అలాగే వన్డే జట్టు సారథిగా బ్రేస్‌వెల్‌ను ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకున్న మిఛెల్ శాంట్నర్ స్థానం లో బ్రేస్‌వెల్ జట్టును నడిపించనున్నాడు. అయితే టీ20 సిరీస్‌కు మాత్రం శాంట్నర్‌నే సారథిగా కొనసాగించనున్నారు. భారత్ స్పిన్ పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని యువ స్పిన్నర్లకు చోటు కల్పించారు.

లెఫ్టార్మ్ ఫింగ ర్ స్పిన్నర్ జైడెన్ లెన్నాక్స్ తొలిసారి జాతీ య జట్టులోకి ఎంపికయ్యాడు. అలాగే భార త సంతతికి చెందిన ఆదిత్య అశోక్ కూడా ఈ టూర్‌కు సెలక్ట్  అయ్యాడు. తమిళనాడుకు చెందిన అశోక్ లెగ్ బ్రేక్ గూగ్లీ బౌలర్‌గా రాణిస్తున్నాడు. మరోవైపు టీ20 జట్టుకు శాంట్నర్ సారథ్యం వహిస్తుండగా.. పలువురు హిట్టర్లకు చోటు దక్కింది. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆల్‌రౌండర్లకు ప్రా ధాన్యతనిచ్చారు. జనవరి 11 నుంచి  వన్డే సిరీస్ ఆరంభం కానుండగా.. తర్వాత ఐదు టీ ట్వంటీల సిరీస్ మొదలవుతుంది.

భారత్‌తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు

బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, క్లార్క్‌సన్, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, మిఛ్ హే(కీపర్), జేమీసన్, నిక్ కెల్లీ, జేడెన్ లెన్నాక్స్, డారిల్ మిఛెల్, హెన్రీ నికో ల్స్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ రే, విల్ యంగ్

భారత్‌తో టీ20లకు న్యూజిలాండ్ జట్టు

మిఛెల్ శాంట్నర్ (కెప్టెన్), బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, కాన్వే, జాకబ్ డప్ఫీ, జాక్ ఫౌల్క్స్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, బెవా న్ జాకబ్స్, డారిల్ మిఛెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి