calender_icon.png 19 August, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాపర్ వైర్ దొంగల అరెస్ట్..

18-08-2025 11:09:15 PM

నగదు, రెండు బైకు లు స్వాధీనం

రేగొండ,(విజయక్రాంతి): కాపర్‌ వైరు, వ్యవసాయ మోటార్లు, కరెంటు తీగలు, బైకులను అపహరిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు గణపురం సిఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం రేగొండ పోలీస్ స్టేషన్ లో ఎస్సై సందీప్ కుమార్ తో కలిసి నిందితుడి వివరాలను వెల్లడించారు. మండలంలోని బాగిర్థి పేట క్రాస్ రోడ్ వద్ద రేగొండ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా నిందితుడు శివ దొంగలించిన బైక్ తో పట్టుబడ్డాడు.దీంతో పోలీసులు అనుమానంతో విచారణ చేపట్టగా చేసిన నేరాలన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కాంటాయపాలెం గ్రామానికి చెందిన చర్లపల్లి శివ(20) గత కొన్ని రోజుల నుండి భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలం కర్కపల్లి లో నివాసం ఉంటూ తన బావమరిది శివరాత్రి లింగబాబు తో కలిసి రేగొండ, నెల్లికుదురు, మండలాల్లోని  దమ్మన్నపేట, బాగిర్తి పేట, లింగాల, రావిరాల, గ్రామాల్లో కాపర్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్ల దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు.

నిందితుడు గోవిందరాజుల గుట్టలో (Ap 20 AG 0250), కొత్తగూడెం సారపాక గ్రామంలో (AP 36 P 7951) నెంబర్లు గల బైకులను దొంగలించినట్లు తెలిపారు. పోలీసులు నిందితుడి వద్ద నుండి రూ.75000ల నగదు, రెండు బైకులు, 5 కిలోల కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఘనపురం సిఐ కరుణాకర్ రావు,రేగొండ ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.