18-08-2025 11:22:06 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని కడ్పల్ గ్రామ శివారులో గల కొచ్చేరు చెరువుకు రాత్రి కురిసిన వర్షానికి గండి పడింది. వెంటనే స్పందించిన తహసీల్దార్ హేమంత్ కుమార్. అధికారులను అప్రమత్తం చేసి గండిని పూడ్చించారు. ఈ చెరువు కింద సుమారు 100 ఎకరాల పంటకు నీరు అందుతుంది. తహసీల్దార్ చొరవకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.