calender_icon.png 19 August, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

18-08-2025 11:01:17 PM

నిర్మల్,(విజయక్రాంతి): అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలను బలహీనం చేసినందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వారు ఆరోపించారు. వేతనాలు పెంచాలని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని పోషకారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన మృతి పత్రాన్ని ఏవో సూర్యారావుకు అందించారు.