calender_icon.png 19 August, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టాలి

18-08-2025 10:53:29 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో వాతావరణ మార్పులు వర్షాల నేపథ్యంలో ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. లక్ష్మణ చందా మండలంలో సోమవారం నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి రోగులకు అందుతున్న ఆరోగ్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి రాజేందర్ గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి అంబాజీ నాయక్ స్థానిక అధికారులు ఉన్నారు.