calender_icon.png 16 September, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకుల్లో బంగారం భద్రమేనా?

16-09-2025 12:17:46 AM

- నిర్మల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటనతో అప్రమత్తం

- నమ్మకమైన బ్యాంకుల్లోనే సిబ్బంది చేతివాటం

- తాకట్టు బంగారం, నగదుపై ఖాతాదారుల ఆందోళన

- అప్రమత్తమైన బ్యాంకులు

- సిబ్బంది పనితీరుపై డేగకన్ను?

సంగారెడ్డి, సెప్టెంబర్ 15(విజయక్రాంతి):బంగారం ధర పెరుగుతున్నకొద్దీ మోసాలు సైతం అదే తీరుగా పెరుగుతున్నాయి..ఇవి ఎక్కడో అనుకుంటే పొరపాటే. .నమ్మకానికి ప్రతీకగా నిలిచే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే తాకట్టు బంగారంపై మోసాలు బయటపడడంతో ప్రజల్లో ఆందోళన మొదలవుతోంది. ఇటీవల నిర్మల్ జిల్లా, చెన్నూరు లో వెలుగులోకి వచ్చిన మోసాలతో సర్వత్రా అ ప్రమత్తంగా ఉండాల్సిన అవసరమేర్పడింది. ఎంతో నమ్మకంగా వ్యవహరిస్తున్న బ్యాంకుల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కొందరు బ్యాంకు ఉద్యోగుల తీరు తో ఆయా సంస్థల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారంపై రుణా లు పొందాలన్నా, రుణ సంస్థలపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బంగారంతో పాటు విలువైన ఆస్తులు, బ్యాంకుల్లో తనఖా పెట్టేముందు జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల మోసం ఆదిలోనే బయటపడుతుం డగా మరికొన్ని చోట్ల నెలల తరబడి జరుగుతోంది. 

నమ్మకానికి ప్రతిబంధకం...

ప్రజల్లో బ్యాంకులపై నమ్మకానికి మారుపేరుగా వి శ్వా సం ఉంది. అయితే కొంతమంది సిబ్బంది తప్పటడుగులతో అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుంది. సాధారణంగా బ్యాంకులు, ప్రైవేటు రుణసంస్థల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. నగ దు, బంగారం వంటి లావాదేవీల్లో క్షుణ్ణంగా పరిశీలనలు, తనిఖీలు ఉంటాయి. ప్రతీ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటా రు. ప్రతీ స్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకత ఉంటుంది. అంతేకాక కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారులపై పర్యవేక్షణ ఉంటుంది. లావాదేవీల విషయంలో ప్రతీది అత్యంత భద్రత మధ్య సా గుతుంటాయి. అయితే అలాంటి నమ్మకం ఉన్నచోటనే ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్ప టి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగకున్నా ఒకింత ప్రజల్లో మా త్రం అనుమానాలు కలుగుతున్నాయి. 

అప్రమత్తమైన బ్యాంకులు, సంస్థలు..

చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచి-2 వ్యవహారంతో బ్యాంకర్లు, రుణసంస్థలు అప్రమత్తమై తమ సంస్థల్లోని అన్ని బ్రాంచీల్లో బంగారం నిల్వ లు, రుణాల లెక్క లు తీస్తున్నట్లు తెలుస్తోం ది. ఈ క్రమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆయా బ్యాంకులు బంగారం నిల్వలపై ఆరా తీసినట్లు సమాచారం. సాధారణ ఆడిట్లతో పాటు ఈ ఘటనల తర్వాత ప్రత్యేక డ్రై వ్ చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖాతాదారులు సైతం కుదవ పెట్టిన బంగారం, రు ణాలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడికక్కడ రుణాలపై క్షుణ్నంగా పరిశీలనలు చేస్తూ తమ సం స్థల పరిధిలో ఉన్న సిబ్బంది పైనా కఠిన ప ర్యవేక్షణ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రా రంభించినట్లు విశ్వసనీయ సమాచారం.