05-11-2025 12:39:41 AM
-సత్యసాయి నిగమంలో నిర్వహణ
-హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమంలో మంగళ వారం సాయంత్రం బ్రాహ్మణ సేవా సంఘ స మాఖ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్తీక వనసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, ప్రముఖ ఆడిటర్ ఎస్‌వీ రావు, ఆలిండియా బ్రాహ్మణ ఫెడ రేషన్ సెక్రటరీ జనరల్ ద్రోణంరాజు రవికుమార్, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు సీహెచ్ ప్రభాకర్, సెక్రటరీ కే చంద్రశేఖర్, ఏఐబీఎఫ్ సెక్రటరీ తులసి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శృంగేరి ఆస్థాన పండితుడు బ్రహ్మశ్రీ పాశర్లపాటి బంగారయ్య శర్మచే కార్తీక మాస విశిష్ట తపై ప్రవచనాలు వినిపించారు. ఈ కార్యక్ర మానికి బ్రాహ్మణులు తరలివచ్చారు.