calender_icon.png 5 November, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

05-11-2025 12:39:24 AM

కొండాపూర్, నవంబర్ 4 : జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం బీఆర్‌ఎస్ మండల అద్యక్షుడు మ్యాకం విఠల్ వివిధ గ్రామాల బాదితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

కొండాపూర్ మండల పరిదిలోని గంగారం గ్రామానికి చెందిన ప్రియాంక కుటుంబీకులకు చెక్కును అందించినట్లు విఠల్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ కొండాపూర్ మండల జనరల్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా నాయకులు బత్తుల విక్రమ్, మాజీ కౌన్సిలర్ జి.వి. శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మునిపల్లిలో...

మునిపల్లి నవంబర్ 4 : మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను మంగళవారం నాడు రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, మాజీ ఎంపీపీ రాంరెడ్డిలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, ఏపీసీఎస్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీటీసీలు బుర్కల పాండు, యాదయ్య, మాజీ సర్పంచులు రాములు, విఠల్ రెడ్డి, మండల కో ఆప్షన్ మాజీ సభ్యుడు రహీం, నాయకులు సంగమేశ్వర్, శంకరయ్య, నాగేష్, ప్రభాకర్, ఇస్మాయిల్, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.