calender_icon.png 16 September, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేరళను వణికిస్తున్న బ్రెయిన్ వ్యాధి

16-09-2025 12:13:22 AM

  1. చాపకింద నీరులా పాకుతున్న ‘అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్’
  2. ఇప్పటికే 18 మరణాలు

తిరువనంతపురం, సెప్టెంబర్ 15: కేరళను కొత్త రకం వ్యాధి కలవరపెడుతోంది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ కేరళ ప్రజలకు నిద్రలేకుం డా చేస్తోంది. ప్రభుత్వం, ప్రజలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా కానీ ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటికే ఈ వ్యాధి 67 మందికి సోకగా.. అందులో 18 మంది మృతి చెందినట్టు లె క్కలు చెబుతున్నాయి.

నీరు శుభ్రంగా లేకపోవడం వల్ల ఈ వ్యాధికి కారణం అయ్యే అమీ బా వ్యాప్తి చెందుతోంది. తిరువనంతపురాని కి చెందిన ఓ 17 ఏండ్ల యువకునికి కూడా ఈ వ్యాధి నిర్ధారణ అయింది. స్విమ్మింగ్ పూ ల్స్, కొలనుల్లో నీరు శుభ్రంగా ఉండకపోవ డం వల్లే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ప్ర జలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణాఅభ్యర్థించారు. సెప్టెంబర్ 14 వ రకు కేరళలో రికార్డు స్థాయి లో 67 కేసులు నమోదయి.. 18 మంది మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో ప్రచురించారు.