calender_icon.png 16 September, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టపరమైన ఉల్లంఘనలను గుర్తిస్తే ‘ఎస్‌ఐఆర్’ రద్దు

16-09-2025 12:11:14 AM

  1. ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు హెచ్చరికలు
  2. వచ్చే నెల 7న తుది తీర్పు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)కు ఎన్నికల కమిషన్ (ఈసీ) అనుసరి ంచిన విధానంలో చట్టాల ఉల్లంఘన జరిగితే, ఆ ఎస్‌ఐఆర్‌ను రద్దు చేస్తామని భారత అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఆ విధంగా చేయదని న్యాయస్థానం భావిస్తున్నదని పేర్కొన్నది.

ఎస్‌ఐఆర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చితో కూడి న ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్లపై కేవలం బీహార్‌కే పరిమితమైన తీర్పు ఇవ్వలేమని, దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఎస్‌ఐఆర్‌పై ప్రభావం చూపేలా అక్టోబర్ 7న తుది తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేసింది.

అలాగే ఈ నెల 8న ఆధార్ కార్డును గుర్తింపుపత్రంగా గుర్తించాలని ఎన్నికల సంఘానికి ఇచ్చిన పిటిషన్‌పైనా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఆధార్‌ను గుర్తింపు కార్డుగా అంగీకరించేందుకు యం త్రాంగం నిరాకరిస్తున్నదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈసీ ఎత్తిచూపుతున్న అభ్యంతరాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆధార్ పౌరసత్వాన్ని ధ్రువీకరించక పోయినప్పటికీ, అది ప్రజల గుర్తింపునకు చట్టబద్ధమైన రుజువు అని తేల్చిచెప్పింది.