16-10-2025 05:22:26 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. పట్టణంలో ఐదు లక్షలతో నిర్మించే ఎల్ఐసి భవనంతో పాటు మున్నూరు కాపు సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఆమెని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వ పరంగా నిధులను మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.